Posts

Showing posts from 2020

నేనేమో తేనె గుంటలో... మీరేమో మురికి గుంటలో..!!

ఒక రోజున శ్రీకృష్ణదేవ రాయలవారికి తెనాలి రామలింగడిని ఏడిపించాలనిపించింది. ఆరోజు ఉదయాన్నే సభ ప్రారంభం అయిన తరువాత సభికులను ఉద్దేశించి తనకో బ్రహ్మాండమైన కల వచ్చిందని చెప్పారు. వెంటనే తెనాలి రామలింగడిని ఉద్దేశించి "రామలింగా.. మీరూ, నేనూ ఓ కొత్త ప్రదేశంలో నడుస్తున్నామట. ఎక్కడికోగానీ మనం ఇద్దరిమే వెళుతున్నామట. నడుస్తూ, నడుస్తూ ఓ రెండు పెద్ద గుంటల మధ్యలో మనం పోవాల్సి వచ్చింది. ఒక గుంట నిండా తేనె ఉంటే, మరో గుంటనిండా మురికి ఉంది. మురికి గుంటలో మలమూత్రాదులతోపాటు చెత్తా, చెదారం అన్నీ ఉన్నాయి. దారి కూడా చాలా ఇరుకుగా ఉంది. అయితే ఆ దారిలోనే మనం నడవాల్సి వచ్చింది" అంటూ ఆపకుండా చెబుతున్నారు రాయలవారు. మళ్లీ కొనసాగించిన రాయలవారు "ఇద్దరం మునివేళ్లమీద మెల్లగా అడుగులేస్తూ పోతున్నామట. అయితే ఆ సన్నటి దారిలో నడవటం సాధ్యంకాక మీరూ, నేనూ పట్టుతప్పి పక్కనుండే గుంటల్లోకి జారి పడిపోయామట. నేనేమో తేనె గుంటలో పడిపోతే, మీరేమో మురికిగుంటలో పడిపోయారు. నేనేమో హాయిగా తేనె గుంటలో పడిపోయి తియ్యటి తేనెను తాగుతూ ఆనందంగా ఉంటే.. మీరేమో..... అబ్బ నేను చెప్పలేను అంటూనే మీరేమో దొడ్డితో నిండిన మురికిగుంటలో పడి...

లెంపకాయ ఖరీదు..!! -- (తెనాలి రామకృష్ణ కథలు )

ఒకరోజు తెనాలి రామలింగడు వీధిలో వెళుతుండగా.. ఎవరో వెనకనుంచి వచ్చి ఒక గుద్దు గుద్దారు. ఆ దెబ్బకి రామలింగడికి ప్రాణం పోయినంత పనయింది. కిందపడిపోయాడు. ఆ దార్లోనే వెళుతున్నవాళ్లు రామలింగడిని లేపి, ఆయనను కొట్టినవాడిని పట్టుకున్నారు. తనని కొట్టినవాడిని చూసిన రామలింగడు.. "నిన్నెప్పుడూ నేను చూడనేలేదు కదయ్యా..? నన్నెందుకయ్యా కొట్టావు..?" అని అడిగాడు. అక్కడున్న అందరూ కూడా కొట్టినవాడిని నిలదీశారు. వెంటనే అతడు కంగారుపడుతూ.. "అయ్యా..! తమరనుకో లేదండీ. నా సావాసగాడు వెనుకనుంచి చూస్తే మీలాగే ఉంటాడు. వాడనుకుని తమాషాగా కొట్టానంతే..!" అని చెప్పాడు. "సావాసగాడయితే మాత్రం తమాషాకి అంత దెబ్బ కొడతావా..?" అంటూ అందరూ గట్టిగా నిలదీశారు. అంతటితో ఆగకుండా అతడిని మంత్రిగారి వద్దకు తీసుకెళ్లి, జరిగినదంతా వివరించారు. మంత్రి రామలింగడిని కొట్టినవాడిని విచారించగా.. తనకు దగ్గర చుట్టం అవుతాడని గ్రహించాడు. అంచేత ఆయన వాడిని ఎలాగయినా రక్షించాలని మనసులో నిర్ణయించుకున్నాడు. "పోనీలేవయ్యా రామలింగా..! ఏదో తెలియక పొరపాటు చేశాడు. ఏమనుకోవద్దంటున్నాడుగా.. ఊరుకో..!!" అన్నాడు మంత్రి. అయితే ...