Posts

Showing posts from 2019

పిల్లి- ఎలుక ! Story 2

Image
గుడ్లగూబలన్నీ గుహలో ఉన్నాయి. మాంఛి నిద్రలో ఉన్నాయి. అదే అదనుగా చిరంజీవి బయటకు వచ్చాడు. పేడను పోగు చేసి, గుహ ద్వారానికి దాన్ని గట్టిగా పట్టించాడు. గాలి కూడా చొరబడలేదు. కావాల్సింది అదే అనుకున్నాడు. సన్నగా నవ్వుకున్నాడు. బయల్దేరాడక్కణ్ణుంచి. ఎగురుకుంటూ వెళ్ళి ఋష్యమూకపర్వతానికి చేరుకున్నాడు. తోటి కాకులన్నీ చిరంజీవిని చుట్టుముట్టాయి. వాటితో పాటుగా రాజును కలుసుకున్నాడు చిరంజీవి. నమస్కరించాడతనికి.‘రాజా! ఆనాడు మీకు నేను చెప్పినట్టే ఉపమర్దనుడి కొలువులో చేరాను. కష్టపడి వాణ్ణి బాగా నమ్మించాను. వాడు నమ్మాడుగాని, వాడి మంత్రులు నన్ను నమ్మలేదు. నన్ను క్షణక్షణం బాధించారు. చంపాలని చూశారు. అన్నీ తట్టుకున్నాను. తిండి కూడా పెట్టలేదు. అయినా ఓర్చుకున్నాను. రాజుని బుట్టలో వేశాను. వీళ్ళెంత? కొన్నాళ్ళు పోతే వీళ్ళే కాళ్ళ బేరానికి వస్తారనుకున్నాను.’‘అద్గదీ, తర్వాత?’ ఉత్సాహపడ్డాయి తోటి కాకులు. గుడ్లగూబల మీద కసిగా ఉంది వాటికి. వాటిని వారించాడు రాజు.‘నువ్వు చెప్పు’ అన్నాడు చిరంజీవితో. ‘మంత్రులెంత చెప్పినా రాజు వారి మాట వినలేదు. నన్ను దూరం చేసుకోలేదు. అదే అవకాశంగా రోజులు నెట్టుకొచ్చాను. ఇన్నాళ్ళకి ముహూర్తం కుదిర...

పిల్లి ప్రేమ ! Story 1

Image
గుడ్లగూబ నుంచి త ప్పించుకునేందుకు పిల్లికి దగ్గరయింది ఎలుక. ఎప్పుడయితే పిల్లిని చూసిందో అప్పుడు భయపడి, అక్కణ్ణుంచి ఎగిరి పారిపోయింది గుడ్లగూబ. ఎలుక దక్కదు సరికదా, పిల్లితో ప్రాణాపాయం ఎందుకొచ్చిన గొడవ అనుకుంది. వలలో చిక్కుకున్న పిల్లిని రక్షించేందుకు ఎలుక సిద్ధపడిందో లేదో యముడిలా బోయవాడు వస్తూ కనిపించాడు. వాణ్ణి చూడగానే పిల్లికి పై ప్రాణాలు పైనే పోయాయి. గోల గోల చేసింది. ‘ఎలుక బావా! అడుగో, బోయవాడు వచ్చేస్తున్నాడు. వాణ్ణి చూస్తూంటేనే వణుకు పుడుతోంది. తొందరగా కాపాడు బావా! ఈ వలలోంచి నన్ను తప్పించు.’‘ఆ పనిలోనే ఉన్నాను.’ అంది ఎలుక. వలను అదే పనిగా పటపటపటమని కొరికి వేసింది. వల చిరిగిన మరుక్షణం కలుగులోనికి దూరి పోయింది. వలలోంచి బయటపడ్డ పిల్లి, చటుక్కున చెట్టెక్కేసింది. బోయవాడికిది ఊహకందలేదు. దొరుకుతుందనుకున్న పిల్లి దొరకలేదు. పైగా వల చిరిగిపోయింది. తల పట్టుకున్నాడతను. వెళ్ళిపోయాడక్కణ్ణుంచి. కనుచూపు మేర బోయని చూసి, అతను మలుపు తిరిగినప్పుడు, ఇక రాడని నిర్ధారించుకుని, చెట్టు దిగింది పిల్లి. ఎలుక దాగిన కలుగు దగ్గరగా వచ్చింది.‘బావా! రారా! నేను, పిల్లి బావను పిలుస్తున్నాను. సరదాగా కబుర్లాడుకుందాం,...